Saturday, December 21, 2024

బోనమెత్తిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని ఆనుబంధ గ్రామమైన గంటూరుపల్లిలో పోచమ్మ బోనాలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని పోచమ్మబోనం ఎత్తినారు.ఆదే విధంగా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి పోచమ్మ బోనాల జాతర చాలా వైభవంగా నిర్వహించారు.

కొత్తపల్లి పట్టణంలో పద్మశాలి దాదాపు 1000 కుటుంబాల వరకు ఉంటాయి అదివారం పట్టణంలో పోచమ్మ బోనాలు దాదాపు 500 బోనాలు పట్టణమంతా ఒకచోట తేదీ ర్యాలీగా బయలుదేరి ఆమ్మవారికి ఘనంగా బోనాలు చెల్లించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి గంగుల కమలాకర్ ,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నం అనిల్ కుమార్ గౌడ్ పాల్గొనగా మంత్రికి,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ లకు మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు కండువా కప్పి ,ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్ , బోయిన్పల్లి వినోద్ కుమార్‌లు బోనం ఎత్తుకొని ర్యాలీగా బోనాల వెంట పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమిటీ రాజేశం , కౌన్సిలర్లు వాసాల రమేష్, స్వర్గం వజ్ర దేవి నరసయ్య, వేముల కవితా శేఖర్, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుడు అనుమల సత్యనారాయణ, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం , పట్టణ పద్మశాలి సంఘం నాయకులు, మరియు మార్కెట్ దేవస్థానం సభ్యులు, యువజన సంఘం నాయకుడు అధ్యక్షుడు వేముల సాగర్ , కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాలు రుద్ర రాధ, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News