Friday, December 20, 2024

ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న సుమారు 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. బాధితులు, స్థానికుల సమాచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్‌లోని శ్రీనాథ్ రోటా ప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలుడు సంభవించింది. దీంతో అందులో పని చేస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యాజమాన్యం క్షతగాత్రులను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం మరికొందరిని హైదరాబాద్ తరలించారు. ప్రమాదంలో 13 మంది కార్మికులకు తీవ్రగాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News