Saturday, November 23, 2024

విపక్షాల బెంగళూరు భేటీకి కుమారస్వామి దూరం

- Advertisement -
- Advertisement -

బుంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో జులై 17, 18 తేదీలలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి జనతా దళ్(ఎస్) హారుకావడం లేదు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్‌కు ఆహ్వానం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2018లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న జెడిఎస్ తాము మరెప్పుడూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ అగ్రనేతలు హెచ్‌డి కుమారస్వామి, హెచ్‌డి దేవెగౌడ ఇటీవల విస్పష్ట ప్రకటనలు చేసిన దరిమిలా ఆ పార్టీని ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానించడం వల్ల ప్రయోజనం ఏమిటని కాగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

బిజెపి, జెడిఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎసార్ బొమ్మై ఆదివారం సూచనప్రాయంగా వెల్లడించాయి. బిజెపి అధిష్టానానికి, మాజీ ప్రధాని దేవెగౌడకు మధ్య చర్చలు సాగుతున్నాయని, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే తన మనోభావాలను బయటపెట్టారని బొమ్మై తెలిపారు. చర్చల తర్వాత భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఉంటాయని ఆయన చెప్పారు. కాగా..పొత్తులపై చర్చించేందుకు త్వరలోనే కుమారస్వామి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News