Friday, January 10, 2025

ప్రాథమిక హక్కులను హరించేలా సిఐ ప్రవర్తన: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ ప్రవర్తన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇటీవల శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కొట్టే సాయిని సీఐ అంజూ యాదవ్ చెంప దెబ్బలు కొట్టిన విషయం తెలసిందే. ఈ ఘటనపై సీరిస్ అయిన పవన్, సోమవారం సిఐపై ఎస్పికి ఫిర్యాదు చేశారు.

శ్రీకాళహస్తిలో చాలా ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తపై సీఐ దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నారని అన్నారు. జనసైనికులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మచిలీపట్నం సభలో చూశామన్నారు. ఈ ఘటనను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించిందని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్‌లో అందరికీ ఇదొక గుణపాఠం లాంటిదన్నారు. మేము కూడా క్రమశిక్షణతో ఉంటామని, పోలీసులు కూడా ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News