Monday, December 23, 2024

చంద్రయాన్ భేషు..మరింత ఎత్తుకి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : నిర్ణీత కక్షల్లో చంద్రయాన్ 3 ప్రయాణం సజావుగా సాగుతోంది. చంద్రయాన్ కక్షను పెంచే రెండో ప్రక్రియను ఇస్రో సోమవారం విజయవంతగా నిర్వర్తించింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత ప్రకటన వెలువడింది. వ్యోమనౌకలోని ఇంధన జ్వలిత చర్యల ద్వారా దీని ఎత్తును పెంచుతూ ఇది చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి వెళ్లేలా చేసే సంక్లిష్ట దశలో ఇప్పుడు రెండో దశను విజయవంతం చేసినట్లు తెలిపారు.

ఇప్పుడు వ్యోమనౌక 41603 కిమీ/226 కిమీ ఆర్బిట్‌లో దూసుకువెళ్లుతోంది. తరువాతి ఇంధన జ్వలిత చర్య మంగళవారం మధ్యాహ్నం జరుగుతుంది. ఈ నెల 14వ తేదీన శ్రీహరికోట షార్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా సాగింది. అంతా అనుకూలిస్తే చంద్రుడిపై ఇది ఆగస్టు చివరి వారంలో వాలుతుంది. ఈ క్రమంలో నాలుగు చంద్రవిజయ స్థాయి దేశాల జాబితాలో నాలుగో దేశం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News