న్యూఢిల్లీ : దేశంలో అన్ని అర్హతలూ ఉన్న యువతకు ఉద్యోగ కటకట ఉంది. తమకు కేవలం 48 గంటల వ్యవధిలో ఉద్యోగార్థుల నుంచి 3000 వరకూ రెస్యూమ్‌లు అందాయిన స్టార్టప్ కంపెనీ స్ప్రింగ్‌వర్క్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కార్తీక్ మాండవిల్లే తెలిపారు. ఇన్ని దరఖాస్తులు రావడం జాబ్ మార్కెట్ పరిస్థితిని తెలియచేస్తోందన్నారు. మానవ వనరుల సెక్టార్‌కు ఈ సంస్థ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. 2014లో దీనిని స్థాపించారు.
తమ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు ఇప్పటివరకూ అందిన దరఖాస్తుల సంఖ్య 13 వేలకు పైగా ఉందన్నారు. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకొంటోంది. చాలా సార్లు చాలా మంది సరైన అవకాశాలకు ఎదురుచూస్తారు. ఇక తొలి ఛాన్స్‌కోసం ఎందరో అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కాలేజీలో చదువులు, పొందిన పట్టాలకు నిమిత్తం లేకుండా జాబ్‌ల కోసం ఎదురుచూడటం , తపించడం అని సంబంధిత పరిణామంపై ఓ నెటిజన్ స్పందించారు.