Friday, January 10, 2025

నిధులు పక్కదారి పట్టలేదు… సిబిఐ విచారణ చేసుకోవచ్చు

- Advertisement -
- Advertisement -
ఎంపి అర్వింద్ ఆరోపణలపై మంత్రి వేముల ఫైర్

హైదరాబాద్ : మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో ఒకే పనికి రెండు విధాలుగా బిల్లులు డ్రా చేసుకున్నారని నిజామాబాద్ ఎంపి అర్వింద్ ఆరోపణలపై తాజాగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బిల్లింగ్‌కు ఆస్కారమే లేదని, నిధులు పక్కదారి పట్టలేదని, ఆరోపణలపై సిబిఐతో విచారణ చేసుకోవచ్చని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
125 శాతం అధికంగా కమీషన్లు పొందారు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ పెద్దవాగుపై నిర్మించిన హైలెవెల్ వంతెన శిలాఫలకం వద్ద ఆదివారం ఎంపి అర్వింద్ మంత్రి వేములపై ఆరోపణలు చేశారు. హైలెవెల్ వంతెనకు ఆర్టీసి (రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్) కింద రూ.15 కోట్లు డ్రా చేసిన తరువాత మళ్లీ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ ద్వారా నిధులు తీసుకున్నారని అర్వింద్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా వచ్చే నిధులతో సంబంధం లేకుండా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం వడ్డీ లేకుండా 50 ఏళ్ల వరకు స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ నుంచి రుణాలు మంజూరు చేస్తుందని, వీటి వివరాల కోసం తాను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరికి లేఖ రాశానని తనకు వివరాలను పంపించారని ఎంపి అర్వింద్ పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగేళ్లలో తెలంగాణకు రూ.5,221 కోట్లు కేంద్రం కేటాయించిందని, అందులో నిజామాబాద్ జిల్లాకు రూ. 317.72 కోట్లు వచ్చాయన్నారు. ఈ నిధులతో జిల్లాలో మొత్తం 51 అభివృద్ధి పనులు చేపట్టగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 33 జరిగాయని, వాటికి డబుల్ బిల్లింగ్ చేసి 125 శాతం అధికంగా కమీషన్లు పొందారని అర్వింద్ ఆరోపించారు. అర్వింద్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి వేముల సిబిఐతో విచారణ చేసుకోవచ్చని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News