- Advertisement -
మాస్కో : రష్యా క్రిమియాను కలిపే అత్యంత కీలకమైన కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు మరోసారి సోమవారం దాడి చేశాయి. సోమవారం తెల్లవారు జామున భారీ పేలుళ్లు జరిగి ఇద్దరు చనిపోగా,వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఇప్పటికే గత ఏడాది ఓసారి ఈ వంతెనపై భారీ దాడి జరగడంతో రష్యా ఇక్కడ భద్రతను మరింత పటిష్టం చేసింది. అయినా తాజాగా దాడి జరగడంతో వంతెనపై వాహనాల రాకపోకలను,
12 మైళ్ల పొడవున రైలు రవాణాను ఆరు గంటల పాటు ఆపివేశారు. ఉక్రెయిన్‌కు చెందిన రెండు సముద్ర డ్రోన్లు ఈ దాడి చేశాయని రష్యా నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీ వెల్లడించింది. గత అక్టోబర్‌లో ట్రక్కు బాంబు దాడిలో వంతెన బాగా దెబ్బతింది. మరమ్మతుకు కొన్ని నెలలు పట్టింది. మరమ్మతుకు ఎంతకాలం పడుతుందో నిర్ణయించడానికి వంతెనను తనిఖీ చేస్తున్నట్టు రష్యా డిప్యూటీ ప్రధాని మారట్ ఖుష్నులిన్ చెప్పారు.
- Advertisement -