Tuesday, November 5, 2024

యువతకు హిమాన్షు ఆదర్శం

- Advertisement -
- Advertisement -
బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దిన హిమాన్షు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారని బిఆర్‌ఎస్, ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. మనసుండాలే కానీ వయసుతో పనేముందని హిమాన్షు నిరూపించారన్నారు. మంత్రి కెటిఆర్ డైనమిక్ లీడర్‌గా ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. తన తాత ఆశీస్సులతో, తండ్రి అడుగు జాడల్లో హిమాన్షు ముందుకు నడుస్తూ తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా తీర్చిదిద్దారని మహేశ్ బిగాల కితాబునిచ్చారు.

దీనిని కూడా ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల పరిపాలనలో ఎన్నడూ లేనంతగా జరగని అభివృద్ధిని కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతుం దన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు మనబడి’ (పథకం) రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. కెసిఆర్ సిఎం అయిన తరువాత ప్రస్తుతం తెలంగాణలో గురుకులాల సంఖ్య 1,009కి చేరిందన్నారు. రాజకీయాల్లో కెసిఆర్‌ను ఎదుర్కొలేక ఇలాంటి అభివృద్ధి పనులను ఏదో ఒకటి అనడం ప్రతి పక్షాల వంతయ్యిందని మహేష్ బిగాల అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News