Saturday, November 23, 2024

త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిసి గర్జన సభ

- Advertisement -
- Advertisement -
రాహుల్ గాంధీ, సిద్ద రామయ్యలను ఆహ్వానిస్తాం
బిసిల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే
మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు

హైదరాబాద్ : త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిసి గర్జన సభ నిర్వహిస్తామని మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, ఆ సమయంలో బిసి జనగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బిసి గర్జన సభ సన్నాహక సమావేశాల గురించి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘బిసి ఛాంపియన్స్ మేము’ అని మోడీ, కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని, బిసి జనాభా ప్రకారం చట్టసభల్లో 50 శాతం స్థానాలు కేటాయించాలని ఆ విధంగా జరగడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిసిల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన తెలిపారు. నేడు బిసి పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. బిసి గర్జన సభకు రాహుల్ గాంధీ, సిద్ద రామయ్యలను ఆహ్వానిస్తామన్నారు. బిసి గర్జన ద్వారా బిసి కులాలకు ఏం చేయాలన్న దానిపై చర్చిస్తామన్నారు. బిసిలకు న్యాయం జరగాలని, పార్టీలో బిసిలకు టిక్కెట్లు ఇవ్వాలని, ఈ విషయమై అధిష్టానంతో మాట్లాడతానని ఆయన తెలిపారు. బిసి గర్జన సభలో బిసి డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. రాహుల్ గాంధీ కులజనగణన చేపడతామని హామీ ఇవ్వగానే అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే బిసి గర్జన సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని హనుమంతరావు తెలిపారు. ఈ నెల 19వ తేదీన మెదక్ జిల్లా సంగారెడ్డిలో, 21వ తేదీన కరీంనగర్‌లో, 23వ తేదీన నిజామాబాద్‌లో 24వ తేదీన ఆదిలాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించారని హనుమంతరావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News