Monday, December 23, 2024

అంబారీపై ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాతబస్తీలో ప్రాచీన మందిరాలైన శ్రీ నల్లపోచమ్మ, శ్రీ మహంకాళి దేవి అమ్మవార్ల ఊరేగింపు ఘట్టం అంబారీపై కన్నుల విందుగా సాగింది. వేలాదిగా భక్త జనం తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 14 బస్తీవాసులు ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. బోనాల పండుగను పురస్కరించుకుని సబ్జిమండిలోని నల్లపోచమ్మ, మహంకాళి దేవి ఉమ్మడి ఆలయాల ఆధ్వర్యంలో 101వ వార్షిక బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్యాట నంద కిశోర్ గారు తెలిపారు.

ఈ సందర్బంగా ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటాన్ని అతి సుందరంగా అలంకరణ చేసినట్లు తెలిపారు. జానపద కళాకారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, వాయిద్యాల సందడి నడుమ మహిళలు, చిన్నారులు, యువకులు ఎంతో ఉత్సాహంగా ఊరేగింపును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు, అదేవిధంగా ప్రభుత్వ శాఖల సహకారంతో ఊరేగింపు అట్టహాసంగా జరగనున్నట్లు చెప్పారు. ఈబోనాల ఉత్సవంలో కోశాధికారి కట్ట శ్రీనివాస్,గంగపుత్ర సంఘం, అధ్యక్షులు అనందేశీ విజయ్ కిశోర్ , కమిటీ సలహాదారులు కట్ట రాజయ్య, గుడబోయిన శివరత్నం, జలగల వేణు, బుర్ర వేణుకుమార్, కట్ట శివరాజ్, కట్ట నర్సింగ్‌రావు, ఆవుశెట్టి శ్యామ్ సుందర్, గాండ్ల నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News