Monday, December 23, 2024

అమ్మవారి దివ్యాశీస్సులతో అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: తెలంగాణ సంస్కృతిని అద్దంపట్టేలా బోనాల ఉత్సవాలను ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారని, శక్తిమంతురాలైన శ్రీ అమ్మవారి దయ, కృప వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతిని, శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని రాష్ట్ర పోలీస్ గృహ సంస్థ ఛైర్మన్ కోలెటి దమోదర్ ఆకాంక్షించారు. బోనాల పండుగ ఉత్సవాలను ప్రజలు అ త్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోమవారం రవీంధ్రభారతిలో భారత్ ఆర్ట్ అకాడమీ, ఎబిసి ఫౌండేషన్ పక్షాన బోనాల జాతర ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద పండుగ ఉత్సవాలు బోనాల సంబరాలని, తెలంగాణ భక్తి సంస్కృతిని ఉట్టిపడేలా కళాకారుల తమ ఆ టపాటల ప్రదర్శనల ద్వారా చాటుతున్నారని కొనియాడారు. కళాకారుల్లో అంతర్లినంగా దాగి ఉన్న కళా సృజనను వెలికితీసేందుకు నిర్వాహకులు లయన్ కేవీ రమణారావు, లలితలు చేస్తున్న కృషిని అభినందించా రు. ఈ సందర్భంగా నర్తకిమణులు తమ డ్యాన్సులను ఆవిష్కరించి ఆహుతులను మంత్రముగ్దుల్ని చేశారు.

కూచిపూడి, భరతనాట్యం, జానపద, బోనాల గీతాలు, గాత్రకచేరిలు సభీకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాట్య గురువులు కనకదుర్గ, విజయలక్ష్మీ, సంపత్, చిట్టి, శ్రీశైలం, రేవతి ప్రసాద్, రమాతులసీ, కరుణశ్రీ, కృష్ణవేణి, సింధు, కుమారి పేరిన్‌దేవి, మౌనిక, కృష్ణప్రియ, సునీతదేవి, సంధ్యారాణిలు పాల్గొన్నారు. తొలుత నిర్వాహకులు కెవి రమణారావు, లలిత రావులు ఆహుతులను స్వాగతించారు. నగర అదనపు డిసిపి రాందాస్ తేజావత్, వైవజ్ఞశర్మలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News