Monday, December 23, 2024

మార్కెట్లోకి రియల్‌మి నార్జో 60 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రియల్‌మీ తన నార్జో 60 సిరీస్ 5జి, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3ని ప్రవేశపెట్టింది. రియల్‌మి నార్జో 60 సిరీస్ 5జి రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రియల్ మి నార్జో 60 ప్రో 5జి, రియల్‌మీ నార్జో 60 5జి, దీంతో పాటు అత్యాధునిక రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3ను తీసుకొచ్చింది. నార్జో 60 ప్రొ 5జి తొలిసారి, ఈ సెగ్మెంట్‌లో 1టిబితో వస్తోంది.

ఈ సందర్భంగా రియల్‌మి నార్జో ఇండియా లీడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ మనీష్ రాణా కొత్త ఫోన్లు, బడ్స్ ఫీచర్ల గురించి వివరించారు. రియల్‌మి నార్జో 60ప్రొలో డైమెన్సిటీ 7050 5జి చిప్‌సెట్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 67డబ్లు సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్‌ను కల్గివుంది. రియల్‌మి 60 5జి ధర 8జిబి+ 128జిబి 256జిబి ధర రూ.19,999గా ఉంది. రియల్‌మి 60ప్రొ 5జి ధర 8జిబి + 128జిబి వేరియంట్ రూ.23,999గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News