Friday, January 3, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

ముత్తారం: వర్షాకాలం సీజన్‌లో ఎక్కువగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీజనల్ వ్యాదుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి లోపల, బయట పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పగటి పూట కుట్టే దోమ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని, ఈ దోమ మంచినీటి నిల్వల్లో వృద్ది చెందుతుందన్నారు. దోమల నియంత్రణతో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టవచ్చని సిబ్బందికి సూచించారు. ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఉండే కుండీలు, కూలర్లలో, ఉపయోగంలేని వస్తువుల్లో నీటి నిల్వలను తొలగించి, తేమోపాస్ ద్రావణం పిచికారి చేయించాలన్నారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంను సందర్శించారు. హరితహారంలో భాగంగా ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆరువేల మొక్కలు కేటాయించగా, అందులో 4 వేల మొక్కలను నాటడం జరిగిందని, మిగితా రెండు వేల మొక్లను నాటి పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ బైరి వేణుమాధవ్, ఏపీఓ దయామని, సర్పంచ్ సముద్రాల రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News