నిర్మల్ : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలోని రైతు వేదికలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి కరెంటు ఇస్తలేరు అని రైతులు ఏమైనా ఫిర్యాదు చేశారా ? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి లాంటి వారికి వ్యవసాయం అంటే తెలుసా ఆయన ఏనాడైనా వ్యవసాయం చేశాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో ఏనాడైనా 24 గంటలు ఉచిత నిరంతర విద్యుత్‌ని ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టి రాష్ట్రాన్ని మళ్లీ అందకారంలోకి నెట్టాలని సూస్తున్నారని వారి పాలనలో ఏనాడు పగటిపూట కరెంటు ఉండేదని కాదని రాత్రిపూట రైతులు పంట పొలాల వద్ద జాగారం చేసి పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతులు మూడు పంలు పండిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రతు రాజ్యం అంటే కేవలం మాటల్లోనేకాక దాన్ని చేతల్లో చేసి చూపించిన ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, రైతులందరూ బాగుంటే రేవంత్ రెడ్డి లాంటి ఆవరు పరేషాన్ లో ఉన్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులను రాజకీయ ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప ఏనాడు వారి సంక్షేమానికి చిత్తశుద్దితో పనిచేయలేదని కాంగ్రెస్ తీరును ఎత్తి చూపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో కేంద్రం చేతులెత్తితే సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారన్నారని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటే కాంగ్రెస్ ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు మూడు గంటలు కరెంటు కావాలా ? మూడు పంటల బిఆర్‌ఎస్ పార్టీ కావాలో తేల్చుకోవాలని కోరారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పాతాళంలో పాతిపెట్టాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హ్యట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని 3 గంటలు వద్దు 3 పంటలు కావాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని రైతుల హర్షద్వానాల మధ్య ఆమోదించారు.