- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో అనేక ప్రాంతాలు యమునా నది వరదలో మునిగి తేలుతుండగా మంగళవారం మరికొన్ని ప్రాంతాలు వర్షాలకు జలమయమయ్యాయి. లజపత్ నగర్, దక్షిణ ఢిల్లీ లోని తూర్పు కైలాష్ ఏరియా, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ సెక్రటేరియట్ ఏరియాల్లో వర్షాలు కురిశాయి. మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం పేర్కొంది. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెంటిగ్రేడ్ కాగా, ఉదయం తేమ స్థాయి 89 శాతం నమోదైంది. సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత సీజన్ సరాసరి ఉష్ణోగ్రత కన్నా తక్కువగా 26.4 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది.
- Advertisement -