Saturday, November 23, 2024

పొగాకుతో కలిగే దుష్ప్రభావంపై అవగాహన కలిగించాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : పొగాకు వినియోగం వలన కలిగే దుష్ప్రభావం పై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు కలెక్టర్ తన ఛాంబర్ లో పొగాకు నియంత్రణపై జి ల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొగాకు వినియోగించ డం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కలిగించాలని అధికారులను కోరారు.

ప్రజలందరూ ఎవరి ఆరోగ్యం వాళ్లే కాపాడు కోవాలన్నారు. పొగాకు విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వైద్యశాఖ, పోలీసు, స్వ చ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి పొగాకు వాడకాన్ని నియంత్రిం చాలన్నారు.చిన్నారుల ఆరోగ్య ంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్ని పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు కారంచుట్టింది.

ఈమేరకు తక్షణమే చర్యలుచేపట్టాల్సిందిగా డీఈఓకుఆదేశాలు జారీచేశారు. అత్యంత శ్రద్ధచూపాలనిసూచించారు. ఫుడ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వారు పొగాకు విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ వారు పట్టణంలోని ముఖ్య కూడలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్. పి.కె.అర్.కె ప్రసాద రావు, జిల్లా వైద్యాధికారి డా.కొండల్ రావు, డీఈఓ బిక్షపతి,, వివిధ శాఖల అధికారులు,  పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News