Monday, December 23, 2024

కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు

- Advertisement -
- Advertisement -

గన్నేరువరం: బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మూడు పంటలకు నీళ్లు ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీడు భూములు అవుతాయని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలోని రైతు వేదికలో సమావేశానికి ఎమ్మెల్యే హజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్ కోతలతో సాగుచేసిన పంటలన్నీ కళ్లముందే ఎండిపోతుంటే చూడలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీమాంద్ర చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నాడని అన్నారు. మూడు గంటలు కరెంట్ ఇస్తే వ్యవసాయానికి సరిపోతుందని రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సియం కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 24గంటల కరెంట్ వ్యవసాయానికి ఇవ్వడంతో పాటు లక్షలాది ఎకరాలను సాగు నీరు ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులు చూడలేక కళ్లలో కారం పోసుకుంటున్నారని దుయ్యాబట్టారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఖాసీంపేట గ్రామానికి వచ్చి మూడు గంటల కరెంట్ సరిపోతుందని తీర్మాణం చేయలని సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News