Friday, November 15, 2024

ఇది అణచివేతపై పోరాటం: రాహుల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: విపక్షాలు చేస్తున్న పోరాటం అధికార బిజెపి, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ పోరాటాన్ని బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా భావించవద్దని, దేశ ప్రజల గొంతుక అణచివేతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా భావించాలని అన్నారు. ‘ దేశ భావజాలం, నరేంద్ర మోడీ మధ్య పోరాటం ఇది.‘ఇండియా’, ఎన్‌డిఎ మధ్య పోరాటం దేశ భావజాల పరిరక్షణ కోసం చేస్తున్న యుద్ధం. దీంతో ఎవరూ పోరాడలేరు.గత చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News