Monday, December 23, 2024

బెజ్జూరు మండలంలో ఎమ్మెల్యే కోనప్ప పర్యటన

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: మండలంలోని సులుగుపల్లి గ్రామం వద్ద గల తీగల ఓర్రే భారీ వర్షాల వల్ల ఉప్పోంగి ప్రవహిస్తుండడంతో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కలిసి బ్రిడ్జిని పరిశీలించి ప్రజలు, వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని, తీగల ఒర్రే ప్రవాహాం ఎక్కువ అయితే రాకపోకలు నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం అశ్రమ పాఠశాలను, కస్తూర్భగాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల బాగోగులను, వంట గదిని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని, వర్షాలు అధికంగా కురుస్తుండడంతో విద్యార్థులు ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News