Monday, December 23, 2024

వీల్స్ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

దండేపల్లి: దండేపల్లి మండలం చెలికగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన ఆత్రం అంజన్న ట్రాక్టర్ డ్రైవర్ (19) సోమవారం రాత్రి వీల్స్ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్రం అంజన్న జైదపేట శివారులో నంబాల గ్రామానికి చెందిన శంకరయ్య రైతు పొలంలో వీల్స్ ట్రాక్టర్ రాత్రి సమయంలో నడుపుతుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. డ్రైవర్ అంజన్నపై ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి తండ్రి నాగేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News