Saturday, December 21, 2024

ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారులు కీలకం

- Advertisement -
- Advertisement -

నస్పూర్: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అధనపు కలెక్టర్లు డి మధుసూదన్‌నాయక్, బి రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు దాసరి వేణు, శ్యామలాదేవిలతో కలిసి అసెంబ్లీ, జిల్లా స్థాయి శిక్షకులతో ఓటరు జాబితా రూపకల్పనపై బూత్ స్థాయి అధికారులకు నిర్వమించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓ యాప్, ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకమైందని అన్నారు. జిల్లాలో 2వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహించేలా అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

బూత్ స్థాయి అధికారులకు, ఆపరేటర్లకు అందిస్తున్న ఈ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సవరణలు, చిరునామా మార్పులు, మృతి చెందిన వారి ఓట్ల తొలగింపులు సంబంధిత భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు, ఆపరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News