Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మిర్యాలగూడ మండలం ఆలగడప లో చోటుచేసుకుంది. మిర్యాలగూడరూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆలగడప గ్రామానికి చెందిన మంద మట్టయ్య (36) విద్యుత్ కా ంట్రాక్టర్ కింద ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నాడు. కాగా రిలయన్స్ ప్రతినిధుల పిర్యాదు మేరకు మట్టయ్య విద్యుత్ కనెక్షన్ పనులు చేస్తున్న క్రమంలో చెట్లు కొడుతుండగా ఒక్కసారి గా విద్యుత్ వైర్లు తెగి పడటంతో విద్యుత్ సరఫరా జరిగి మట్టయ్య అక్కడి కక్కడే మృతి చెందాడు.

చికిత్స నిమిత్తం ప ట్టణం లోని ఓ ఆసుపత్రి కి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అది నీ కుటుంబ సభ్యులు బంధువులు మృత దే హాన్ని డిఈ కార్యాలయం వద్దకు తరలించి ఆందోళన చేపట్టారు. ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డప్పటికీ సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని బాధితుని కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఆందోళన చేపట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అక్కడనుంచి ఆలగడప రిలయన్స్ టవర్ వద్దకు తరలించి ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

త్రీ ఫేస్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్ర మంలో ఎల్సి తీసుకున్నారా, లేదా అనేది అనుమానస్పదంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News