న్యూఢిల్లీ : డెమెన్షియా రిస్కు తీవ్రంగా ఉన్న వృద్ధుల్లో జ్ఞాపకశక్తి క్షీణించడాన్ని హియరింగ్ ఎయిడ్స్ (వినికిడి సాధనాలు) చాలావరకు తగ్గిస్తాయని లాన్సెట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది వయో వృద్ధులను అధ్యయనం లోకి తీసుకుని ప్రయోగాలు చేశారు. వృద్ధాప్యంలో ముఖ్యంగా డెమెన్షియాను గుర్తించడంలో ఆలస్యం జరిగినప్పుడు జ్ఞాపకశక్తిని పరిరక్షించడానికి వైద్య చికిత్స చేయడం శక్తివంతమైన సాధనంగా పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే ఇది వ్యక్తిగతంగా వారి జ్ఞాపకశక్తి నశించడంపై చికిత్స ఆధారపడి ఉంటుందని అమెరికా లోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రాంక్ లిన్ పేర్కొన్నారు. వృద్ధాప్యంతో వినికిడి కోల్పోవడమన్నది సాధారణం. ప్రపంచ వ్యాప్తంగా అరవై ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో రెండింట మూడొంతుల మంది వినికిడి కోల్పోతుంటారు.