Saturday, November 16, 2024

టాప్10లో వొండ్రుసోవా

- Advertisement -
- Advertisement -

మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వింబుల్డన్ ఛాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) టాప్10కు ఎగబాకింది. డబ్లూటిఎ మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వొండ్రుసోవా పదో ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వొండ్రుసోవా ఏకంగా 32 ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడం విశేషం. ఆమె కెరీర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. వింబుల్డన్‌లో అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన వొండ్రుసోవా టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో వొండ్రుసొవా కెరీర్ లో తొలిసారి టాప్10లో చోటు సంపాదించింది.

ఇక పోలండ్ సంచలనం ఇగా స్వియాటెక్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకు ంది. స్వియాటెక్ 9,315 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. అరినా సబలెం కా (బెలారస్) 8,845 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇక ఎలినా రిబకినా (కజకిస్థాన్) మూడో, జెసికా పెగులా (అమెరికా) నాలుగో, కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ఓన్స్ జాబేర్ (ట్యూనిషియా) ఆరో, కొకొ గాఫ్ (అమెరికా) ఏడో, పెట్రా క్విటోవా (చెక్) ఎనిమిదో, మారియా సక్కారి (గ్రీక్) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News