Friday, December 20, 2024

రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల జమ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో నిర్వహించిన వేలంలో తెలంగాణ రాష్ట్రం రూ.2వేల కోట్లను రుణంగా సమీకరించుకుంది. మంగళవారం ఆర్‌బిఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో 21, 23 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్లు చొప్పన రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేయగా.. వేలంలో ఆ మొత్తం రావడంతో రాష్ట్ర ఖజానాకు చేరింది. తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ. 12 వేల 430 కోట్ల రుణాలను పొందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News