Monday, December 23, 2024

జూ. కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరరు

- Advertisement -
- Advertisement -
ఇంటర్ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1654గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ప్ర భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియేట్ విద్యాశాఖ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా జిల్లా పరిధిలో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు చేపడతారు.ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కాలేజీ ప్రిన్సిపల్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కావాల్సిన సబ్జెక్టులకు ఫ్యాకల్టీ ఎంతమంది అవసరమో నిర్ణయిస్తారు.

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్య అధికారులు ప్రకటన జారీ చేసి, అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేస్తారు. ఆ తర్వాత జిల్లా ఇంటర్ విద్య అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో పిజి మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా ఇంటర్ విద్య అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీకి మెరిట్ లిస్టును పంపిస్తారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ గెస్ట్ ఫ్యాకల్టీనీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మూడు సెట్ల ఫోటో కాపీలతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి. బయోమెట్రిక్ హాజరు కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందికి ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News