- Advertisement -
శ్రీనగర్‌ః జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బుధవారం ఉదయం కుప్వారా సెక్టార్‌లో బిఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎల్ఒసి వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమర్చినట్లు ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. వారి వద్ద నుంచి 4 ఎకె రైఫిల్స్, 6 హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ అపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
- Advertisement -