Friday, April 11, 2025

భారీ వర్షాలపై జిహెచ్‌ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్‌ సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నానక్ రామ్ గూడలోని కార్యాలయంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోజ్, జోనల్ కమిషనర్ల పాల్గొన్నారు. హైదరాబాద్ లో వరదలు, పారిశుద్ధ్యంపై సమావేశంలో చర్చించారు. రానున్న 2,3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని కెటిఆర్ వెల్లడించారు. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్యయంతో పనిచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల్లో ప్రాణనష్టం జరగకూడదని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News