Friday, November 22, 2024

కాంగ్రెస్‌లో జూనియర్‌లు పెత్తనం చెలాయిస్తే ఊరుకుంటామా…

- Advertisement -
- Advertisement -
  • సీనియర్ జూనియర్‌ల మధ్య గొడవలున్నాయి
  • రాహుల్ హామీతో బిజెపిలో వణుకు పుట్టింది
  • మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు

సంగారెడ్డి: కాంగ్రెస్‌లో సీనియర్ జూనియర్ నాయకుల మధ్య గొడవలున్నాయని, సీనియర్‌లపై జూనియర్‌లు పెత్తనం చేలాయిస్తే ఊరుకుంటామా అని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్‌గార్డెన్‌లో బిసి గర్జన సన్నాహక సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మళజగ్గారెడ్డి అ ధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅథితి గా హాజరైన వి.హనుమంతరావు మాట్లాడతూ బిసిల కు రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దని, బిసిలను అఇన్న రకాలుగా మోసం చేస్తున్న మోసగాడు సిఎం కెసిఆర్ అని ఆయన ఆరోపించారు. బిసి కులాలను అన్ని రాజకీయ పార్టీల్లో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. బిజెపి ప్రధానీ నరేంద్రమోడీని బిసిని చేస్తే తాను బిసిగా సం తోషించానని, కానీ బిజెపి పాలనలో మోడీ బిసిలకు చేసిందేమి లేదన్నారు.

కులాల పేరుతో కోట్లాడవద్ద ని, బిసిలుగా ఐక్యమత్యంతో ఉండాలన్నారు.మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలని, పేదల గు రించి ఆలోచించేది సోనియా గాంధీ కుటుంబం అన్నారు. పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పా ర్టీయే అని, మహిళలకు రిజర్వేషన్‌లు, గరీబీ హఠావో అనే నినాదంతో పేదలకు సేవచేసింది కాంగ్రెస్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో భారీ బిసిల బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుందని, ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. సభ తేదీలను త్వరలోనే మళ్లీ వచ్చి చెప్తానని, సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు. అందరు కలిసి కట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ను సిఎం కెసిఆర్ బంగాళఖాతంలో వేస్తానని చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్ర జలే సిఎంను బిఆర్‌ఎస్ నాయకులను బంగాళఖాతంలో కలిపేస్తారని ఘాటైన వ్యా ఖ్యలు చేశారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అడుకునే వాడని ధ్వజమెత్తారు. అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే చరిత్ర తెలంగాణ సిఎంకే ఉందన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందన్నారు.అగ్ర కులాల వాళ్లు ఓబిసిలను అణగదొక్కుతున్నారని దు య్యబట్టాగరు. ప్రతి పార్లమెంట్ పరిథిలో మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అడుగుతామన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే అవినీతి పరులు, బిజెపిలో చేరితే సత్యహరిచంద్రులా అని ఆయన బిజెపిని ప్రశ్నించారు. ఆప్‌కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ రైతులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం జైల్లో వే స్తుందన్నారు. ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, జగదీష్, జనరల్ సెక్రటరీలు లక్ష్మ ణ్ యాదవ్, మాజీ ఎంపిపి ఆంజనేయులు, సంజీవరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంతకిషన్, శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జార్జ్ కూన సంతోష మహేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News