Monday, December 23, 2024

పట్టణ ప్రగతికి అహర్నిశలు కృషి

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: ప్రజలకు తామున్నామనే భరోసా కల్పించే నాయకులు రాజకీయాల్లో అతి తక్కువ మంది మాత్రమే ఉంటారని, ప్రభుత్వాల ద్వారా అధికారుల ద్వారా అవార్డులు అందుకుంటూ పొంగిపోయే నాయకులను ఎందరినో చూస్తున్నాం కానీ ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్న నాయకుల్లో కొద్ది మంది మాత్రమే ఉంటారని, అందులో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సతీమణి మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ ఉండటం ఆ ప్రాంత ప్రజల అదృష్టంగా భావించవచ్చు.

ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాజీవనంలో ప్రశంసలు అందుకుంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో నాలాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ ప్రజల నుండి తనదైన శైలిలో ప్రశంసలు అందుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరిని ఆకర్షిస్తున్నది.

ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపల్ సిబ్బంది, సఫాయి కార్మికులతో కలిసి దగ్గరుండి మరీ పట్టణ ప్రగతికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని మర్రివాడ పెద్ద మోరి డ్రైనేజీలో కూరుకుపోయిన చెత్తచెదారం తొలగింపు పనులను పూర్తి చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో సానిటేషన్ ద్వారా పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయించారు.

ఒక వైపు వర్షం పడుతుంటే లెక్క చేయక కార్మికులకు తగు సూచనలు చేస్తూ పనిలో నిమగ్నమైన మున్సిపల్ చైర్మెన్ నాయకులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా దగ్గరకు వెళ్లి వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు.

మంథని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఐదేళ్లు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న పుట్ట శైలజ తదనంతరం ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కౌన్సిలర్లను గెలిపించుకొని ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మెన్ పదవిని చేపట్టారు. తన భర్త జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అండదండలతో చైర్మెన్ పదవికి వన్నె తెస్తున్నారు. అభివృద్ది పనులతో ప్రజల ముందుకు వెళ్లుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News