సిరిసిల్ల: గులాబీ జండా సాధించిన విజయాలు గడప గడపకు వివరించి మరో సారి మంత్రి కెటిఆర్‌ను భారీ మెజార్టీతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో గెలిపిద్దామని (టిఎస్‌పిటిడిసి) తెలంగాణ రాష్ట్ర పవర్‌లూమ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ అన్నారు. బుధవారం సిరిసిల్లలోని 30వ,31వ వార్డులకు చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బూత్ కమిటీని నియమించారు.
ఈ సందర్బంగా బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు,టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి తదితరులు మాట్లాడారు. తెలంగాణలో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తూ సిఎం కెసిఆర్ విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు.తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రాంతం అతి తక్కువ కాలంలోనే అభివృధ్ది చెందిందన్నారు.సిఎం కెసిఆర్ పాలన చూసి దేశమే నేడు అబ్బుర పడుతోందన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా ప్రతి కార్యకర్త గర్వంగా ప్రజలను ఓట్లు అడగవచ్చన్నారు. అభివృధ్ది సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించి మరోసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత బిఆర్‌ఎస్ కార్యకర్తలపై మాత్రమే ఉందని, సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది సభ్యులున్నారన్నారు.
కెసిఆర్‌ను మరోసారి సిఎంగా చేయడం కోసం సిరిసిల్లలో కెటిఆర్‌ను మరోసారి గెలిపించడం కోసం కార్యకర్తలు గులాబీ సైన్యంగా మారి అన్నిరకాల ప్రచార వ్యూహలతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిని ఇంటింటికి ప్రచారం చేసి రానున్న శాసన సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలకు సూచించారు.
సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ చేసిన అభివృధ్ది పనులను ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. తెలంగాణలో ప్రజలకు బిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో, అభివృధ్దితో దేశానికి దార్శనికునిగా మారిన ప్రజానేత సిఎం కెసిఆర్ అన్నారు. రానున్న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధులనే గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి,మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజ, వార్డు ఇంచార్జీ ఏనుగుల ఎల్లయ్య, మున్సిపల్ విసి మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు తుమ్మ రాధ, బొల్లి రామ్మోహన్, ఎండి సత్తార్,సామల శ్రీనివాస్, సబ్బని శాంత, అగ్గిరాములు, ఇజ్జగిరి, మామిడాల రమణ, జలంధర్, బాబు,ఆంజనేయులు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.