Saturday, November 23, 2024

ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రజలకు సృజనాత్మక మార్పులు రావాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రజలలో సృజనాత్మకమైన మార్పులు తీసుకువచ్చి,ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడొక ప్రకటనలో తెలిపారు. బుధవారం నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ‘ఇ ంటింటా ఇన్నోవేటర్‘ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ‘ఇంటింటా ఇ న్నోవేటర్‘ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేష న్ సెల్ (టిఎస్ఐసి) వారు జిల్లాలో అన్ని రంగాలలోని ప్రజల నుండి వాట్సప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, గ్రామాలలో, పట్టణాలలో ఉండే అన్ని రంగాలు,వర్గాల నుండి ఆవిష్కరణలు ఆహ్వానించబడుతున్నట్లు, అంటే గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఆవిష్కర్త పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, జిల్లా, ఆవిష్కరణ పేరు, ఆవిష్కర గురించి 6 వాక్యాలు, ఆవిష్కరణకు సంబంధించిన 4 చిత్రాలు/ఫొటోలు, ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల వీడియోను 9100678543 అనే నంబరుకు వాట్సప్ ద్వారా వచ్చే ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపిక అయిన ఆవిష్కరణలను జిల్లాలో ఆగస్టు 15 న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో వాటిని ప్రదర్శించే అవకాశం ఉంటుందని,ఆవిష్కర్తలకు సర్టిఫికేట్ల ప్రదానంతో పాటు (టి ఎస్ ఐ సి) టీం ద్వారా ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారం కూడా అందించబడుతుందని తెలిపారు.మరిన్ని వివరాలకు ఈ-జిల్లా మేనేజర్ నంబరు 7995016042 ను సంప్రదించాలని ఆమె ఒ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News