Sunday, December 22, 2024

కలిసి పనిచేద్దాం.. కాంగ్రెస్ నేతల ఐక్యతా రాగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కలహాలు మాని కలిసి పనిచేద్దామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యతా రాగం అందుకున్నారు. బుధవారం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెద్దామని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, జానారెడ్డి, కోదండ రెడ్డి, సంపత్‌కుమార్ తో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికలకు వంద రోజులే ఉన్నందున నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపే లక్షంగా పనిచేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

పార్టీలో చేరికలు, పార్టీ అగ్రనేతల పర్యటన, ఎన్నికల హామీలు, ప్రచార అంశాలపై సమాలోచనలు జరిపినట్లు ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, స్టార్ క్యాంపేయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. 30న కొల్లాపూర్ సభకు ప్రియాంక హాజరు కానున్నట్లు తెలిపారు. తొమ్మిదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని అన్నారు. రేవంత్ రెడ్గికి వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సాగుకు 8 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, అన్నారు. బిసిని సిఎంగా చేస్తారా అని ప్రశ్నించారు. బిసిలకు కాంగ్రెస్‌ను మించి న్యాయం చేసిన పార్టీ మరొకటి లేదని అన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములు ఆలొక్కంటున్నారని, ధరణి పోర్టల్‌లో పేరు నమోడు కాక పోవడంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. యుద్దానికి ఇక వంద రోజులే ఉందని, ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని కోమటి రెడ్డి అన్నారు.

త్వరలో బస్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పిఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 30న ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. దమ్ముంటే బిసి సిఎం చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బిసిలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై చర్చిస్తామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా 26 పార్టీలు కలిసి ఏకతాటిపైకి వచ్చాయన్నారు. ఓబిసి జనగణన చేపట్టాలని రాహూల్ గాంధీ ఇప్పటికే చెప్పారన్నారు. విపక్షాలకు పోటీగా మోడి ఎన్‌డిఎ సమావేశాన్ని నిర్వహించారని, రాఫెల్ ఒప్పందంలో ఎంత డబ్బు పెట్టి కొనుగోలు చేశారో మోడి సమాధానం చెప్పాలన్నారు. మోడి చెప్పిన మేకిన్ ఇన్ ఇండియా ఏమైందని ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోడి క్షమాపణ చెప్పాలి కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందన్నారు. ఫిరాయింపుల ద్వారా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను మోడి కూల్చారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News