Monday, January 20, 2025

ఆగస్టు 1 నుండి గురుకుల నియామక పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి గురుకుల నియామక పరీక్షలు ఆగస్టు 1 నుండి 23వ తేదీ వరకు సిబిఆర్‌టి(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్‌లను జులై 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇటీవల విడుదలైన గురుకుల నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరిల్లో 9,210 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను ఆగస్టు 1 నుంచి 23 వరకు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ www.treirb.telengana.gov.in ను సందర్శించి తమ పరీక్ష షెడ్యూల్ తెలుసుకోవాలని గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News