Tuesday, December 24, 2024

నియోజకవర్గంలో గతంతో పోల్చితే నేడు మెరుగైన అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తుంగతుర్తి నియోజకవర్గంలో గతంతో పోల్చితే ఎంతో మెరుగైన అభివృద్ధి జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన బుధవారం మోత్కూరు మండల ప రిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివిధ శాఖలపై సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2014లో ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే అభివృద్ధితో గొప్ప మార్పు జరిగి ఆనందంగా ఉందని, గతంలో ఏ ఊ రికి వెళ్లినా, ఏ అధికారితో మాట్లాడినా అభివృద్ధి కార్యక్రమాలైనా, సంక్షేమ పథకాల్లోనైనా ఎన్నో సమస్యలు ఉండేవని, వాటన్నింటిని అధిగమించి చేసిన అభివృద్ధి అ యినా, సంక్షేమ పథకాల అమలైనా ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందన్నారు.

నియోజకవర్గం మొత్తం అద్దంలా మారిందని చెప్పను గాని గతంతో పోల్చితే మెరుగైన అభివృద్ధి మాత్రం జరిగిందన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ ఏర్పాటు, మండలంలో చూసినా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గ్రామాలకు, మండలాలకు రోడ్లు ఎంతో అభివృద్ధి చెందాయని, నూతనంగా మరో హైవే పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మున్సిపాలిటీలో కూడా రోడ్డు విస్తరణకు టెండర్లు పిలిచారని, ఆ పనులు కూ డా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చిన సమయంలో గ్రామాలకు రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో ్ర గామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేశామన్నారు.

దళితబంధు పథకంలో తిరుమలగిరి మండలంలో మొత్తం లబ్ధిదారులకు దళితబంధు ఇచ్చామని, నియోజకవర్గంలో మరికొంత మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేశారని, అందుకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. బీసీల్లో 14 కులాలతో పాటు ఎంబీసీని కూడా తీసుకుని 15 కులాల లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ రూ.లక్ష లోన్ మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇస్తామని ప్రకటించారని, నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఈ నెలాఖరకు వరకు ఎంపిక చేసి ఇస్తామని తెలిపారు. గృహలక్ష్మీకింద ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టుకోవడానికి మహిళల పేరున రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో కూడా యాదాద్రి జిల్లాలో 17 వేల యూనిట్లు , నల్లగొండ జిల్లాలో 35 వేలు, సూర్యాపేట జిల్లాలో 25 వేల యూనిట్లు ఇస్తారని, కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కాకుండా గతంలో లిస్టుల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు.

అన్ని వనరులు ఉపయోగించుకుని అవకాశం ఉన్న మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉన్నా వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. దాచారం, పనకబండ పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా సరిపడా టీచర్లు లేరని, టీచర్ల సంఖ్య పెంచాలని సర్పంచులు అండెం రజిత, బత్తిని తిరుమలేష్ కోరగా సర్దుబాటు చేయాలని ఎంఈవోను ఆదేశించారు. పాలడుగు చెరువు సైడ్ వాల్ నిర్మాణానికి రూ.1.50 లక్షలతో టెండర్ పూర్తయిన తర్వాత రద్దయ్యిందని సర్పంచ్ మరిపెల్లి యాదయ్య తెలుపగా తన ఫండ్స్ నుంచి తిరిగి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.

ఈ సమావేశంలో జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీమారయ్య, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, సర్పంచులు రాంపాక నాగయ్య, మరిపెల్లి యాదయ్య, పేలపూడి మధు, బత్తిని తిరుమలేష్, దండెబోయిన మల్లేష్, పైళ్ల విజయ, అండెం రజిత, ఎలుగు శోభ, ఏవో స్వప్న, హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా, సీడీపీవో జ్యోత్స, వెటర్నరీ ఏడీ మోతీలాల్, ఏపీవో కరుణాకర్, ఏపీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News