హైదరాబాద్ : జర్మనీలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగ నియామకాలతో టామ్‌కామ్ అప్రెంటిస్‌షిప్ లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గాను జులై 21,22 తేదీల్లో హైదరాబాద్ మల్లేపల్లి క్యాంపస్‌లోని టామ్‌కామ్ కార్యాలయంలో నిరుద్యోగుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు భవన నిర్మాణం, మీట్ ప్రాసెసింగ్ ఫుడ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు అందుబాటులోఉన్నాయని, మంచి ఉద్యోగం మాత్రమే కాకుండా డైనమిక్ అంతర్జాతీయ వాతావరణంలో వ్యక్తిగత ,
వృత్తిపరమైన అభివృద్ధిని అనుభవించే అవకాశం ఉంటుందని తెలిపింది. దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయస్సు 28 సంవత్సరాల లోపునే ఉండాలని, కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్, ఐటిఐ, లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని టామ్‌కామ్ వెల్లడించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ పేర్లను టామ్‌కామ్ వెబ్ సైట్లో తమపేర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. మరిన్ని వివరాలకు టామ్‌కామ్.తెలంగాణ.జీఓవి.ఇన్, లేదా 9701732697 / 7893566493ని సంప్రదించవచ్చని పేర్కొంది.