Saturday, November 23, 2024

ఐద్వా ఆధ్వర్యంలో అక్టోబర్ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:పెరుగుతున్న ధరలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరుద్యోగం ఉపాధి సమస్యలపై అక్టోబర్ 5న ఐద్వా ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఇ ందిరా అధ్యక్షతన నిర్వహించిన ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు భద్రత కరువైందన్నారు.

ప్రతిరోజు ఏదో ఒక మూల దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఉద్యోగ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఉపాధి హామీ పనులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదని పని దినాలు తగ్గించి వేతనాలు తగ్గించి మహిళలకు కూలీలకు తీరని అ న్యాయం చేశారన్నారు. పెరుగుతున్న ధరలతో కొనలేని తినలేని పరిస్థితులు దాపురించాయని ఈ సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో వేలాదిమంది చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్ణయించినట్లు ఈ కార్యక్రమంలో మహిళలు వేలాదిగా పాల్గొనాలన్నారు.

సెప్టెంబరు ఆగస్టు నెలలో ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేల అనంతరం జీపు జాతాలు ఎంపీడీవో ఆఫీసుల ముందు ధర్నాలు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా సహాయ కార్యదర్శి జిట్టా సరోజ, భూతం అరుణకుమారి, పాదూరి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యుల ఎండి. సుల్తానా, వెంకటమ్మ, కనుకుంట్ల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News