Tuesday, January 21, 2025

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అమీర్ పేట, పంజాగుట్ట, మెహిదిపట్నం, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమైయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద భారీగా వర్షపు నీరు చేరుకుంది. అటు జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News