Monday, December 23, 2024

కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలను బాటసింగారం వెళ్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి నిరసన తెలిపారు. దీంతో కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘనందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని కారులో పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు హైదరాబాద్ సమీపంలోని బాట సింగారం గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకులను పోలీసులు గురువారం గృహనిర్బంధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News