Monday, December 23, 2024

గృహనిర్బంధంలో తెలంగాణ బిజెపి నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు హైదరాబాద్ సమీపంలోని బాట సింగారం గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ నాయకులను గురువారం గృహనిర్బంధం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ, రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం గ్రామంలోని ఇళ్ల ప్రాజెక్టులలో ఒకదానిని సందర్శించాలని దాని నాయకులు ప్లాన్ చేశారు. బీజేపీకి చెందిన 60 మంది నేతల బృందానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి నేతృత్వం వహించారు. అయితే, బీజేపీ నేతలను గ్రామానికి వెళ్లకుండా పోలీసులు గృహనిర్భందం చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి బాట సింగారం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇతర బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచిన వారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కాగా, తమ పార్టీ నేత గృహనిర్బంధాన్ని కిషన్ రెడ్డి ట్విటర్‌లో ఖండించారు. ‘బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోని నిరంకుశ పాలనను ఇది మరోసారి బట్టబయలు చేసింది. అధికారపక్షం, ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకను అణచివేయడమే కేసీఆర్‌ ప్రభుత్వ లక్షణం’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News