Monday, January 20, 2025

బిజెపిపై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిజెపి పాలిత రాష్ట్రాల్లో రుణాల గురించి ఆ పార్టీ ఎపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలుసుకోవాలని వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఎపి రాష్ట్రానికి బిజెపి తరుఫున అధ్యక్షురాలు కావడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముగ్గురూ కలిసే వస్తామంటారు కానీ ఒక్కరే కనిపిస్తారని దుయ్యబట్టారు. ఎంత మంది కలిసొచ్చినా జగన్ పాలన ముందు నిలవలేరని, జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పురంధేశ్వరికి కనిపించడంలేదా? అని అడిగారు. వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించి అర్హత ప్రతిపక్షాలు కోల్పోయాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాలు తమని గెలుపుస్తున్నాయని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read: పోస్టుమాస్టర్‌ను ప్రియుడు చంపి… తల్లికి లోకేషన్ షేర్ చేశాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News