న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసి కస్టడీలోఉంచి దర్యాప్తు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈడీ దర్యాప్తును మద్రాస్ హైకోర్టు సమర్ధించడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన సవాల్ చేశారు. బాలాజీ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈడీ ఏ సమయంలోనైనా బాలాజీని కస్టడీ లోకి తీసుకునే అవకాశం ఉందని, ఈ పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలని కోరారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మద్రాస్ హైకోర్టు వెల్లడించిన కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ ఓ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేసిందని దీనిని కూడా కలిపి విచారించాలని కోరారు. దీంతోఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అంగీకరించారు.
Also Read: బిజెపిపై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు