Saturday, December 21, 2024

ఓటు వేసే విధానంపై అవగాహన తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఈవిఎం, వివి ప్యాట్‌ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ సమీకృత కార్యాలయ సముదాయ ఆవరణలో ఈవిఎం, వివి ప్యాట్‌ల ప్రదర్శన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు ఎంత మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు, వారి వివరాలతో పాటు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు సాయంత్రం పోలైన ఓట్ల వివరాలను తెలపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మూడు ప్రచార రథాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై నేటి నుంచి ఆయా నియోజకవర్గాల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటరు https://www.nvsp.in పోర్టల్‌లో తమ ఎపిక్ నెంబర్‌ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి గోవిందరాజులు, ఎన్నికల విభాగం సూపరిండెంట్ జాకీర్ అలీ, నాయబ్ తహసిల్దార్ ఎలక్షన్ రాఘవేందర్, ఎలక్షన్ సిబ్బంది కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News