Saturday, December 21, 2024

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కాసాని జ్ఞానేశ్వర్ రూ. 5 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహాం ఏర్పాటుకు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రూ.5 లక్షల విరాళం అందజేశారు. వికారాబాద్ కు చెందిన వివిధ ప్రజా సంఘాల నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నగరంలో టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని కోరగా ఇందుకు సానుకూలంగా స్పందించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అంబేద్కర్ విగ్రహం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించి చెక్కును వికారాబాద్ ప్రజా సంఘాల నాయకులకు అందజేసి ఆయన మాట్లాడుతూ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికి అన్ని కులాలకూ దిక్సూచి అన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమేనన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, వికారాబాద్ జిల్లా వివిధ ప్రజా సంఘాల నాయకులు కిషన్ నాయక్, రాములు, రాంచందర్, మాజీ కౌన్సిలర్ రమేష్, సురేష్, జగదీష్, అనంతయ్య, అశోక్, కృష్ణ, పవన్, నర్సింలు, వెంకట రత్నం, సర్పంచ్ రత్నం, శంకర్, బి. రవి, చందర్, బి నర్సింగ్, మయూర్ పాల్గొన్నారు.
టీ. టీడీపీలో చేరిన ఆదిలాబాద్ నేతలు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు యువ నాయకులు గురువారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమక్షంలో టీ. టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్ ఆధ్వర్యంలో సంజు, సునీత, అనిల్ తదితరులకు జ్ఞానేశ్వర్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహాక కార్యదర్శి పుట్టి రాజు ముదిరాజ్, నిజాం పేట్ మున్సిపాలిటీ టీడీపీ నాయకులు దూడల వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News