Friday, November 15, 2024

పొంగిపొర్లుతున్న వాగులు

- Advertisement -
- Advertisement -
  • జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
  • కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
  • ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం

సిద్దిపేట రూరల్ : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో సిద్దిపేట తో పాటు హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గలలోని పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్లలో ఇళ్లు కూలిపోయాయి. ప్రధాన రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు మండలాల్లో పంటలు వరదలకు మునిగిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు అలుగు దూకుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత ఎప్పటికప్పుడు పరిస్థితిను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News