- ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలి
- సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట: జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రభుత్వ ఆస్పత్రుల పనుల యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా వైద్యారోగ్యశాఖ, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి, నిర్మాణ ఏజెన్సీలతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రభుత్వ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయ్యాలన్నారు. జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనుల్లో అధిక మొత్తంలో కూలీలను సమకుర్చుకుని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఆస్పత్రిలో ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, పార్కింగ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇలా ప్రతిదీ సమకూర్చుకొని అధునాతనమైన ఫర్నిచర్ ఆక్సిజన్ ప్లాంట్ సమకూర్చుకోవాలని ఆర్‌ఎన్ కన్స్ట్రక్షన్ నిర్మాణ ఏజెన్సీకి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు చివర కల్ల ప్రారంభానకి సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే నర్సింగ్ కళశాల, 50 పడకల ఎంసిఎచ్ హాస్పిటల్- హుస్నాబాద్, వంద పడకల ఎంసిఎచ్ హాస్పిటల్-గజ్వేల్, 30 పడకల జనరల్ హాస్పిటల్-చేర్యాల నిర్మాణ ఏజెన్సీలతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఎదురైన తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పనులు మాత్రం త్వరగా వేగంగా పూర్తి చెయ్యాలన్నారు. 1000 పడకల ఆసుపత్రి ప్రక్కనే నిర్మిస్తున్న కెంద్రీయ మెడికల్ స్టోర్, 50 పడకల ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కాంట్రాక్టర్ లు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా అందివ్వాలన్నారు.
వెటర్నరీ కళశాల శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటిన ఇంకా పనులు ప్రారంభం కాలేదు కాంట్రాక్టర్లు ఫైనల్ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులకు తెలిపారు. 2 పిఎచ్ సి సెంటర్లు నంగునూరు మండలం గట్ల మల్యాల, హుస్నాబాద్ మండలంలో మీర్జాపూర్, 30 సబ్ సెంటర్లు నిర్మాణంలో ఉన్నవి త్వరగా పూర్తి చెయ్యాలని, అలాగే నిర్మాణం పనులు ప్రారంభం కాని సెంటర్లు స్థానిక చిన్న చిన్న నిర్మాణ ఎజెన్సీ లతో కలిసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిఎం,ఎచ్ ఓ డా. కాశీనాథ్ కు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణాలలో జెడ్పిటిసి, ఎంపిపి, ఎంపిటిసి లు మీమీ ప్రాంతాలలోని నిర్మాణాలను తరచూ పర్యవేక్షణ చెస్తు పనులు పూర్తి చేసెలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఓఎస్డీ బాల్‌రాజ్‌కి తెలిపారు. టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ద్వారా నిర్మాణం చేపడుతున్న పలు పోలీస్ స్టేషన్లు సిద్దిపేట 2, 3 టౌన్, గజ్వేల్ ఎసిపి ఆఫీస్, ములుగు, గౌరారం ఇతర పోలీస్ స్టేషన్లను నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి కె చంద్రశేఖర్ రెడ్డి, సిఈ రాజేందర్ కుమార్, ఎస్‌ఈ సురేందర్ రెడ్డి నిర్మాణ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.