Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని రైతు వేదికలో రైతుల సమావేశం లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే అని, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా రావని, రైతుల ను వ్యతిరేకించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సాగు నీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపధ్యంలోనే రైతులు మంచి పంటలు పండిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్న కా ంగ్రెస్, బిజేపి లను బొంద్ద పెడతామని, ఉచిత విద్యుత్ ఎత్తివేతకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆగ్రహ జ్వాలలో ఉన్నారని అన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చి సాగును సీఎం కేసీఆర్ పండుగగా మార్చితే, ఈ కాంగ్రెసోళ్లు రైతులు పొట్ట కొట్టాలని చూస్తున్నారని అన్నారు.

తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరి లాంటిదని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. నిన్నటి దాకా ధరణి రద్దు రైతు బందు వద్దూ అంటూ విప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రస్, ఇప్పుడు ఏకంగా ఉచిత కరెంటును ఎత్తివేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతాకవిత రాధారెడ్డి, జడ్పిటిసి కృష్ణకుమారి శేషు, మండల పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షులు అనంతుల సైదయ్య, గణపవరం సర్పంచ్ విజయ కిరణ్, దేవాలయ ఛైర్మన్ నరసింహారావు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు గంట శ్రీనివాసష్, ఉన్నం హనుమంతరావు,  నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News