Saturday, November 16, 2024

ఇండియన్ ఏర్పాటు శుభపరిణామం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:దేశంలో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియన్ కూటమి ఏర్పడటం శుభపరిణామమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లోని శ్రీలక్ష్మీనరసింహా ఫ ంక్షన్‌హాల్లో జరిగిన సిపిఐ జిల్లా సమితి రాజకీయ శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏ దేశంలో లేనటువంటి భిన్న నాగరికతలు, ఆచారాలు, రాజకీయాలు భారతదేశంలో ఉన్నాయన్నారు. హిందుత్వం పేరుతో బిజెపి వీటిని కాలరాయలని చూస్తోందని, బరితెగించి భిన్నత్వానికి తావులేకుండా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తీసుకుచ్చే ప్రయత్నం చే స్తుందన్నారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదోఒక వివాదాస్పద అంశాన్ని తీసుకువచ్చి లబ్ధిపొందేలా బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. ఒకసారి త్రిబుల్‌తలాక్ మరొకసారి ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలను తేవడం బిజెపికి అలవాటన్నారు. సున్నితమైన అంశాల ను తెరపైకి తీసుకువచ్చి దేశ భవిషత్తు ను రాజకీయప్రయోజనాల కోసం బిజెపి దిగజారుస్తుందన్నారు. తె లుగు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిలు, జాతీయ రాజకీయాల్లో ఏకూటమిలో లేవన్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకు బిఆర్‌ఎస్ ఇండియా కూటమిలో చేరితే ఎటువంటి అపార్ధాలకు అవకాశం ఉండదన్నారు.

జాతీ య రాజకీయాల్లో సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు ఉంది కానీ, రాష్ట్రాల్లో పరిస్ధితిని బట్టి బిజెపిని ఎదుర్కొనేందుకు, బిజెపిని అడ్డుకునేందుకు ఇతరపార్టీలతో క లిసే స్వేచ్ఛ కూడా ఉందన్నారు. సిపిఐ పార్టీ పొత్తులు, సీట్లపై రకరకాల కధనాలు వినిపిస్తున్నాయని ఈ కధనాల లీకేజీ మంచి పద్దతి కాదన్నారు. సిపిఐ క్రమశిక్షణ కలిగిన పార్టీఅని రాజకీయల్లో వీరోచితమైన పోరాటాన్ని చేస్తుందని ఎవరివద్ద భిక్షం ఎత్తదని తెలిపారు. సిపిఐ పొత్తులపై, సీట్లపై వాస్తవాలు ఉంటే తెలపాలన్నారు. రాష్ట్రంలో సిపిఐ బలంగా ఉన్నచోట ఎట్టిపరిస్ధితిల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

త్యాగాలతో కూడిన కమ్యూనిస్తూ పార్టీకి డబ్బుతో పనిలేదని విలువలతో పనిచేస్తుందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర స హాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గన్నా చంద్రశేఖర్‌లు పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, ఉస్తేల సృజన, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లీశ్వరీ, పాలకూరి బాబు, ధూళిపాళ ధనుంజయ్ నాయుడు, ఉస్తేల నారాయణ రెడ్డి, మండల వెం కటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, అనంతు మల్లీశ్వరీ, పోకల వెంకటేశ్వర్లు, బత్తిని హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News