న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపుర్ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, తాజా ఘటనలపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండు సార్లు స్వల్ప వ్యవధి వాయిదా వేసినప్పటికీ.. సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
రాజ్యసభ వాయిదా అనంతరం రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల తీరుపై మండి పడ్డారు. వారి ప్రవర్తన చూస్తుంటే సభ సజావుగా నడవ కూడదమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. మణిపుర్ సంఘటనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు సభా కార్య కలాపాలను అడ్డు కున్నాయని అన్నారు. మరోవైపు, లోక్‌సభ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం 2గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ‘మణిపూర్-..మణిపూర్, మణిపూ ర్-కాలిపోతోంది’ అంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు శాంతించక పోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మణిపుర్ అంశంపై ఇరు సభల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం స్పష్టం చేసిందన్నారు. చర్చలు ప్రారంభమైన తర్వాత దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇస్తారని అన్నారు. ఈ చర్చ కు సంబంధించిన సమయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశ మయ్యాయి.
ఇటీవల మృతిచెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ లకు సభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలవ్వగా.. మణిపుర్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టు బట్టాయి. దీంతో మళ్లీ రెండు గంటలకు వాయిదా పడ్డాయి.
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -